మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్‌ | Heatwave urgent warnings over AC blast risks in India | Sakshi
Sakshi News home page

మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్‌

Apr 28 2026 3:26 PM | Updated on Apr 28 2026 3:47 PM

Heatwave urgent warnings over AC blast risks in India

ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడిమిని తట్టుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ఏసీలను వాడుతున్న పరిస్థితి.  ఏసీలను వాడటం మాత్రమే కాదు వాటిపని తీరుపై ప్రాథమిక అవగాహన చాలా అవసరం. లేదంటే వేసవిలో పేలే అవకాశం ఉంది. అందుకే ఎండాకాలంలో ఏసీల వాడకంలో  తీసుకోవాల్సిన జాగ్రత్త లేంటి? ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలో తెలుసుకుందాం ఈ కథనంలో...

వేసవిలో ఏసీ పేలడం కారణంగా  అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న ఉదంతాలను అక్కడక్కడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో  ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలో తెలుసుకోవడం అవసరం. 

ఏసీ పేలుళ్లకు అత్యంత సాధారణ కారణం కంప్రెసర్‌లో అధిక పీడనం అని నిపుణులు చెబుతున్నారు. ఇది తరచుగా ఏసీ వేడెక్కడం, గాలి ప్రవాహానికి ఆటంకం కలగడం లేదా అంతర్గత లోపాల వల్ల సంభవిస్తుంది. మూసుకుపోయిన ఫిల్టర్లు లేదా అడ్డంకులున్న అవుట్‌డోర్ యూనిట్ల నుండి సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల వేడి మరింతగా లోపలే చిక్కుకుపోయి, సిస్టమ్‌పై ఒత్తిడిని పెంచుతుంది. R32 , R290 వంటి మండే స్వభావం గల రిఫ్రిజెరెంట్ల వాడకం వల్ల, ఇరుకైన ప్రదేశాలలో గ్యాస్ లీకేజీలు మండించబడితే అవి చాలా ప్రమాదకరంగా మారతాయి.

ఏసీలు పేలడానికి ముందు ACలు కూలింగ్ తగ్గడం, అసాధారణ శబ్దాలు, తరచుగా పవర్ ట్రిప్‌లు, కాలితున్న వాసన, ఆకస్మికంగా విద్యుత్ హెచ్చుతగ్గులు వంటి హెచ్చరిక సంకేతాలను చూపవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారి తీయ వచ్చు. ఈ లక్షణాలేవి కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలని టెక్నీషియన్లు సిఫార్సు చేస్తున్నారు.

మెయింటినెన్స్
కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి యూనిట్లకు సర్వీసింగ్ చేయించడం, ఫిల్టర్లు, కాయిల్స్‌ను శుభ్రపరచడం, సరైన వెంటిలేషన్‌ను  ఉండేలా జాగ్రత్తపడాలి. వేసవికాలంలో ఏసీలను వాడే ముందు శుభ్రంచేయడం. ఏసీ సరిగ్గా పనిచేస్తుందో? లేదో నిపుణులైన టెక్నీషియన్ ద్వారా తనిఖీ చేయించడం ముఖ్యం. లేదా సంబంధిత బ్రాండ్‌ సర్వీస్‌ సెంటర్‌ వారిని సంప్రదించాలి. దీని వల్ల లోపాలను ముందుగానే గుర్తించవచ్చు. అన్నిఎలక్ట్రికల్ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవచ్చు. 

వైరింగ్ తనిఖీ
ఏసీకి అనుబంధంగా ఉన్న వైరింగ్‌ను  తనిఖీ  చేయాలి.  ఏవైనా లోపాలు కనిపిస్తే బాగు చేయించుకోవాలి,  లేదా వెంటనే మార్చుకోవాలి.  వైరింగ్‌ సరిగ్గా లేకపోతే షాక్‌  వచ్చే అవకాశాలుంటాయి.

రిమోట్‌లో కూల్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్ లేదా ఎనర్జీ-సేవింగ్ మోడ్ వంటి మోడ్‌లు పనిచేయక పోవడం, AC లోని సెన్సార్ పనిచేయక పోవడాన్ని సూచిస్తుంది. మోడ్‌లు ఏవీ సరిగ్గా పనిచేయకపోతే, వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

వెంటిలేషన్‌ 
ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో, మంచి వెంటిలేషన్ ఉంచితే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాలి సరిగ్గా  రాదు.  గాలి ప్రవాహం సరిగ్గా ఉటే ఏసీ యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి పడదు.  వెంటిలేషన్‌ సరిగ్గా లేకపోతే కంప్రెసర్‌ వేడెక్కి అగ్ని ప్రమాద అవకాశాలను పెంచుతుంది.

ఒక వేళ ఏసీ ఎలక్ట్రికల్ భాగాలు పాడైతే, వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన, కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి. అలాగే పవర్ సాకెట్లు, ప్లగ్గులు, షెడ్యూల్ బ్రేకర్లు నాణ్యతను ఒకటిరెండు సార్లు చెక్‌ చేసుకోవాలి. ఏసీ టెంపరేచర్‌ని రూమ్ టెంపరేచర్ కంటే తక్కువగా సెట్ చేసుకోవడం చాలా కీలకం.

ఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసన వస్తున్నా, లీకేజీ ఉన్నా కూడా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు గమనిస్తే పొరపాటున  కూడా  నీటిని  చల్లకూడదు.  నిపుణులు వచ్చి తనిఖీ చేసేదాకా  ఏసీని ఆఫ్ చేయడం ఉత్తమం.

ఏసీ నిరంతరం వాడుతున్నవారు  ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీ ని ఆఫ్ చేసి ఉంచాలి. దీని చాలాప్రమాదాలను నివారించవచ్చు. అలాగే  ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలు ఇంట్లో ఉంటే మంచిది. ఎలాంటి ప్రాణాపాయాలు కలగకుండా ఉంటాయి.

ఎలాంటి ఏసీలను తీసుకోవాలి? 
నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలను వినియోగించే, నాణ్యమైన బ్రాండుకు సంబంధించిన బ్రాండ్‌లను మాత్రమే కొనుగోలు చేయాలి.  

నోట్‌ : ఏసీలు వాడుతున్నవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మైంటెయిన్ చేయాలి. దీని వల్ల చల్లదనాన్ని ఆస్వాదించడంలోపాటు, కరెంట్‌ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్‌పై కత్తితో దాడి, షాకింగ్‌ రీజన్‌?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement