ధర్మవరంలో సీఐ భార్య ఆత్మహత్య | CI wife commits suicide | Sakshi
Sakshi News home page

సీఐ భార్య ఆత్మహత్య

Mar 26 2026 3:25 AM | Updated on Mar 26 2026 12:04 PM

CI wife commits suicide

ధర్మవరం అర్బన్‌:  శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం జీఆర్‌పీ (రైల్వే) సీఐ అశోక్‌కుమార్‌ భార్య చాముండేశ్వరి (40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ధర్మవరం శివరామ్‌నగర్‌లో అశోక్‌కుమార్‌ దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె వర్షితారాణి అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్, కుమారుడు పునీత్‌రాయ్‌ ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నారు. 

మంగళవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం దంపతులిద్దరూ నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన అశోక్‌కుమార్‌ భార్య పక్కన కనిపించకపోవడంతో ఆమెను పిలుస్తూ మరో బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. అప్పటికే ఆ గదిలోని ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న చాముండేశ్వరిని గమనించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

టూ టౌన్‌ సీఐ రెడ్డప్ప, మృతురాలి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చాముండేశ్వరి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి అన్న శివకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement