మనస్తాపంతో భర్త ఆత్మహత్య
పటాన్‌చెరు టౌన్: పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లాకు చెందిన రాములు (23) అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌పూర్ లో ఉంటూ స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నా డు. రాములుకు వికారాబాద్‌కు చెందిన ఓ యువతి (18)తో నెల కిందట వివాహం జరిగింది.
ఈ క్రమంలో అతను గతనెల 28వ తేదీన భార్యతో తాను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి, నువ్వు ఎవ రినన్నా ప్రేమించావా? అని అడగడంతో అతని భార్య.. తాను కూడా ఒక వ్యక్తిని ప్రే మించానని చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆలోచిస్తూ.. మనస్తాపానికి గురైన రాములు శనివారం బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాములు కోసం వెతుకుతుండగా సుల్తాన్‌పూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


