
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు(YS Jagan) ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani). వైఎస్సార్‌సీపీకి(YSRCP) ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు అంత భయం? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. చంద్రబాబు ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం. వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు అంత భయం? అని వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలన ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీదే గెలుపు. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు’.
ఇక, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో(Tadepalle Central Office) జరుగుతున్న ఈ మీటింగ్‌కు రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)లు హాజరయ్యారు.
