
సాక్షి,విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు.
ఈ సందర్భంగా.. ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. ఎంపీ చిన్ని అక్కసు, ఆక్రోశం, బాధ అన్ని వెళ్లగక్కారు. ఆయనకు ప్రజాసేవ పట్టదు.. ప్రజలు పట్టదు.. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టరు. రోజూ క్లోజింగ్ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది. అందుకని రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మాట్లాడితే ఎలా.
2007లో ఎండోమెంట్ కమిషన్ వాళ్ళు 130 మంది 2 లక్షలు కట్టి దేవుడు భూముల అక్షన్‌లో పాల్గొన్నారు. 130 మంది అక్షన్‌లో పాల్గొంటే నేను భూమి ఎలా కొట్టేశానో మరి చిన్ని చెప్పాలి. 130 మందిలో 30వ వ్యక్తి టీడీపీ మంత్రిగారి మనిషి ఉన్నాడు. మరి నేను కూడా ఆయన్ని కొనేసానా?. కుక్క తోక పట్టుకొని కృష్ణా నది పట్టుకొని ఈదడం కుదరదు.
బెజవాడ ఎంపీ కూర్చు స్థానాన్ని అదమ స్థానానికి పడేశారు. భారత్ నుండి గొప్పగా క్రికెట్‌లో కప్పులు తెచ్చారని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పదవి ఇచ్చారు. భూములపై విచారణ చేపించండి.. భూములు లాక్కొండి. ఐదు ఎకరాల 30సెంట్లు వెనక్కి లాక్కోండి. అందరిపై కేసులు పెడుతున్నారు గా.. పెట్టుకోండి..
బియ్యం కొట్టేసామని చెపుతున్నారు. నా కేసు ఏ పాటిదో టీడీపీ నేతలను,న్యాయవాదుల్ని అడగండి. నాకు శిక్ష వేయించాలి అనుకొంటే 25ఏళ్ళు, 50 ఏళ్ళు వెయిస్తే వేయించండి. కేజీ రూ.90 రూపాయల చొప్పున నేను కట్టాను. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం వ్యాపారం చేసేది మీరు కదా?. పెద్దిరెడ్డి మీ మేనేజర్ కాబట్టి మీ ఆఫీస్‌లో కూర్చొని రేషన్ బియ్యం వ్యవహారం నడుపుతున్నారు. నెలకు కోటిన్నర మీకు పెద్దిరెడ్డి ఇస్తున్నారు. ఇది మేం చెప్పింది కాదు.. మీ టీడీపీ నేతలే చెపుతున్నారు. ఇక్కడ డబ్బు కొట్టేసి హైదరాబాద్ పంపిస్తున్నారు. ఆ కొట్టుడు దగ్గరే ఏడుగురు ఎమ్మెల్యేలకు పడడం లేదు. తమ్ముడు కిషోర్‌ని అడ్డం పెట్టుకొని లోక్‌సభ నియోజకవర్గాన్ని మొత్తం లూటీ చేస్తున్నారు. ఇసుక మన దగ్గర నుండి ఖమ్మం పోతోంది. బూడిద చెన్నై కంపెనీకి ఇచ్చేశారు. నందిగామలో ఏడు రిచ్‌లలో ఐదు మూసేసి రెండు మాత్రమే నడుస్తున్నాయి. పదహారు టైర్ల టిప్పర్లు.. 50 టిప్పర్లు నందిగామ నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఒక్కో లారీకి రూ. లక్ష 25వేలు వసూళ్లు చేస్తున్నారు.

ఢిల్లి నుండి పార్లమెంట్ నుండి ఒక్క రూపాయి అయినా తెచ్చావా?. కంచికచర్ల దగ్గర ఉన్న డంప్ ఎందుకు అధికారులు పట్టుకోరు?. పట్టాబి, మీరు కలిసి గొడుగు పల్లి వెంకటరస్వామి స్థలం వేసేశారు. దేవుడు భూములు, అమ్మిన , అద్దెకు ఇచ్చిన వేలం పాట ద్వారా మాత్రమే నిర్వహించాలి.. నేరుగా ఇవ్వకూడదు. హైకోర్టు ఉత్సవాల పనులు ఆపేయాలి తీర్పు ఇస్తే పనులు అపలేదు. కోర్ట్ మాటలు కూడా లెక్కలేదు. బుడమేరు మునిగినప్పుడు కంగారు పడలేదు. న్యూ ఆర్ఆర్ పేటలో డయేరియా కట్టడికి హడావిడి లేదు. అమ్మవారి ఉత్సవాలకు మాత్రం హడావిడి..దీనివల్ల ఎవరికి లాభం లేదు.. ఎంపీ అంటే మొత్తం పీకేసి లోపల వేసుకోవొచ్చు అనే కొత్త అర్థం చెప్పాడు.
కేశినేని నాని ఎంపీ పదవి గర్వంగా, హుందాగా బ్రతికాడు. నువ్వేమో బెడజవాడ ఎంపీ స్థానాన్ని అధమానికి పడేశావు.వచ్చే ఎన్నికల్లో ఏడుగురు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంపీ సీటు ఇవ్వకుండా అపుతారు. రూ.48 కోట్లు కట్టి సిటిజన్ షిప్ కట్టి డల్లాస్‌లో ట్రంప్‌కి పోటీగా పోటీ చేయొచ్చు. ఇప్పటికైనా మంచి పనులు చేస్తే ప్రజలు అయినా అయ్యో పాపం అనుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.