సాక్షి, తాడేపల్లి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో జరిగిన ప్రమాదాలపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఐదుగురు, విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఇద్దరు, పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆస్పత్రికి వెళ్తే.. ఆయువు తీశారు


