ఆలయాన్ని కూల్చివేసి.. వైఎస్సార్‌సీపీపై నిందలా? | Bhumana Karunakar Reddy Reaction To Anjaneyaswamy Temple Demolition | Sakshi
Sakshi News home page

ఆలయాన్ని కూల్చివేసి.. వైఎస్సార్‌సీపీపై నిందలా?

Nov 24 2026 1:05 PM | Updated on Nov 24 2026 1:14 PM

Bhumana Karunakar Reddy Reaction To Anjaneyaswamy Temple Demolition

సాక్షి, తిరుపతి: ఆంజనేయస్వామి ఆలయాన్ని దుర్మార్గంగా కూల్చివేశారని.. ఆలయాన్ని కూల్చివేసి వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన  కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాగుబోతులతో స్వామివారి  విగ్రహాన్ని తొలగించారు.. కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదంటూ హెచ్చరించారు.

1861లో ఆంజనేయపురం రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేశారు. గంజాయి, మద్యం మత్తులో ఉన్న కూలీలు స్వామి విగ్రహాన్ని పెకిలించి వేశారు. శాస్త్రోక్తంగా తొలగింపు చేయాల్సిన విగ్రహాలు కూలీలతో పెకిలించి తొలగిస్తారా..?. పల్లవుల కాలం నాటి ఆలయం చరిత్రను వక్రీకరిస్తారా..?. కేవలం 70 ఏళ్ల నాటి ఆలయం అంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బ్రిటిష్ కాలంలో ఆంజనేయపురం రైల్వే స్టేషన్ కాలంలో ఆ పేరుతో  ఏర్పాటు చేసింది నిజం కాదా..?. తొలి పల్లవులు కాలంలో అభయ ఆంజనేయ స్వామి కోనేరు నిర్మాణం, ఆలయం కనిపించడం లేదా..?’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు.

ఇదీ చదవండి: పురాతన ఆలయం ధ్వంసం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement