పోటీ నుంచి తప్పుకోకుంటే చంపేస్తా | Nandyal TDP BJP Leaders Clash Sarpanch Election Violence Burrireddypalle | Sakshi
Sakshi News home page

పోటీ నుంచి తప్పుకోకుంటే చంపేస్తా

Nov 24 2026 12:30 PM | Updated on Nov 24 2026 12:44 PM

Nandyal TDP BJP Leaders Clash Sarpanch Election Violence Burrireddypalle

టీడీపీ నేతలపై బండరాయి విసురుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అనుచరుడు

నంద్యాల: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయి. పదవుల కోసం నిన్నటిదాక కలసిమెలిసి తిరిగిన భాగస్వామ్య పక్షాల నేతల మధ్యనే బాహాబాహీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల జిల్లా బుర్రారెడ్డి పల్లెలో టీడీపీ బలపరిచిన సర్పంచి అభ్యర్థి ఇంటిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు దాడికి పాల్పడటంతో మండలంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరి స్థితులు నెలకొన్నాయి. దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపల్లె గ్రామ పంచా యతీ జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో టీడీపీ తరఫున గ్రామ నాయకుడు నారపురెడ్డి భార్య జోష్ణ, బీజేపీ తరపున కాకర్ల రమేష్‌ చౌదరి భార్య యువరేఖలు పోటీ పడుతున్నారు. 

టీడీపీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులను ఎలాగైనా ఉపసంహరించుకునే లా ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియ అందుకు ఒప్పుకోకపోవడంతో పోటీ అనివార్యమైంది. ఇదిజీర్ణించుకోలేని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సోమవారం గ్రామాని కి చేరుకుని ‘ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోవాలి.. ఈ రోజు నుంచి మీరు ప్రచారం మానుకోవాలి లేకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి’ అని అభ్యర్థి ఇంటికి పోయి హెచ్చరిస్తూ తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తానంటూ బహిరంగంగానే అల్టీమేటం ఇచ్చారు. 

జాతీయ రాజకీయాలు చేసే నాకు పోటీనా..  
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ జాతీయ రాజకీయాలు చేస్తున్న నా గ్రామంలో మాపై పోటీ చేస్తారా అంటూ మధు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే అఖిలప్రియ పోటీ చేయమంటేనే పోటీ చేశామని టీడీపీ శ్రేణులు చెప్పినా ససేమిరా అంటూ అభ్యర్థి ఇంటిపైకి దూసుకుపోయి రాళ్లతో దాడికి దిగారు. పెద్ద బండరాయి ఎత్తి అభ్యర్థి భర్తపై వేయబోగా పక్కనున్న వాళ్లు అడ్డుకోవడంతో కొంచెంలో పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామంలో మహిళలు, పెద్దలు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గకుండా బాహాబాహీకి దిగారు. ఒకరికొకరు రాళ్ల దాడులు, అరుపులు కేకలు విన్న గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. అధికారం కోసం కూటమి నేతలు ఇలా వీధికెక్కి కొట్టుకోవడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement