హే రామ్‌.. ఆలయాలను కాపాడండి.. ఏపీని రక్షించండి | YS Jagan Slams Chandrababu Government Over Demolition of Temples: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

హే రామ్‌.. ఆలయాలను కాపాడండి.. ఏపీని రక్షించండి

Nov 24 2026 5:13 AM | Updated on Nov 24 2026 5:13 AM

YS Jagan Slams Chandrababu Government Over Demolition of Temples: Andhra Pradesh

తిరుపతి సమీపంలో పురాతన ఆలయం కూల్చివేతపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం 

ఆలయాలపై బుల్డోజర్లు.. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ? 

బాబు పాలనలో ఆలయాల కూల్చివేతల పరంపర కొనసాగుతూనే ఉంది  

గతంలో తిరుమల వెయ్యికాళ్ల మండపం, విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేశారని ధ్వజం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పవిత్ర ఆలయాల కూల్చివేతలపై వైఎస్సార్‌­సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు పాలనలో ఆలయాల కూల్చివేతల పరంపర కొనసాగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి సమీపంలోని ఆంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ సోమవారం ‘ఎక్స్‌’లో ఒక పోస్టు చేశారు. 

తిరుమల వేయికాళ్ల మండపం నుంచి...
‘హే రామ్‌.. ఆలయాలను కాపాడండి.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి... చంద్రబాబు పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగు­తూనే ఉంది. ఆంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి.

తిరుమలలో చారిత్రక వెయ్యికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయ­వాడలో 40 ఆలయాలను కూల్చివేయడం... బద్వేలులోని కాశినాయన జ్యోతిక్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తే... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది. మీ ప్రభుత్వం దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?’ అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement