అభ్యర్థులపై దాడులు చేస్తున్నా చర్యలు తీసుకోరా? | YSRCP leaders lodge a complaint with the State Election Commission regarding TDPs atrocities | Sakshi
Sakshi News home page

అభ్యర్థులపై దాడులు చేస్తున్నా చర్యలు తీసుకోరా?

Nov 25 2026 4:54 AM | Updated on Nov 25 2026 4:54 AM

YSRCP leaders lodge a complaint with the State Election Commission regarding TDPs atrocities

అనిల్‌చంద్ర పునేఠకు వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్‌సీ ఎమ్మెల్సీ, నేతలు

నామినేషన్‌ పత్రాలు చించేస్తున్నా పట్టించుకోవడం లేదు 

సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికల కమిషన్‌ సూచనలు బేఖాతర్‌ 

అన్ని ఆధారాలు, వీడియోలు అందజేసినా ఎస్‌ఈసీ మౌనం 

మీడియా సమావేశంలో మండిపడిన వైఎస్సార్‌సీపీ నేతలు 

పంచాయతీ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి మూకల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు 

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి 

ప్రతి అభ్యర్థి నామినేషన్‌ తీసుకోవాలని, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమినేతల దౌర్జన్యాలు, బెదిరింపులపై, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ల తిరస్కరణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) చర్యలు మాత్రం మాటలకే పరిమితమవుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకునే ధైర్యం ఎస్‌ఈసీకి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికల కమిషన్‌ సూచనలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి, లీగల్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.  

నామినేషన్‌ పత్రాలు చింపేస్తున్నా చర్యలు ఏవీ.. 
వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్‌ పత్రాలను వెన్నుపోటు పార్టీ కూటమి మూకలు చించివేస్తున్నా, అభ్యర్థులపై దాడులు చేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై చర్యలు లేవని,  ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నా ఒక్క అధికారిపైనా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. పత్తికొండలో స్రూ్కటినీ సమయంలో నామినేషన్‌ పత్రాలు చింపిన వీడియోలు, బనగానపల్లిలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థిని పోలీసు అధికారి కొట్టిన ఘటనకు సంబంధించిన ఆధారాలు అందించాం.  వీడియోలు, ఆధారాలతో ఇస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.  

అన్నీ సుప్రీంకోర్టు దృష్టికి... 
చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 570 నామినేషన్లు తిరస్కరించారు. ముందు జాగ్రత్తగా సుప్రీంకోర్టును ఆశ్రయించాం. నామినేషన్‌ ప్రక్రియ నుంచి కౌంటింగ్‌ వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఆన్‌ చేయకుండా ఉండటం, ఆన్‌ చేసిన కెమెరాల ప్లగ్‌లు తొలగించడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నా­యి. 

ఇవన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లబోతు­న్నాం. ప్రతి అభ్యర్థి నామినేషన్‌ వేసే­లా, ప్రతి ఓటరు ఓటు వేసేలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పేర్కొ­న్నారు. ఎస్‌ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నాయ­కులు అంకంరెడ్డి నారాయణమూర్తి, నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, కొమ్మూరి కనకారావు, నత్తా యోనారాజు,  సుధాకర్‌రెడ్డి, బీవై రామయ్య, బొందిలి నరేంద్ర సింగ్, షరీఫ్,  తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement