పవన్ కళ్యాణ్‌ను నమ్ముకున్నందుకే మాకు ఈ దుస్థితి | Dharani Krishna Mother Nagamani Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్‌ను నమ్ముకున్నందుకే మాకు ఈ దుస్థితి

Nov 25 2026 5:54 PM | Updated on Nov 25 2026 5:59 PM

Dharani Krishna Mother Nagamani Comments On Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: జనసేన కార్యాలయంలో ఉద్యోగాల పేరుతో జరిగిన స్కాంలో తన కుమార్తె ధరణీకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తల్లి నాగమణి తెలిపారు. ఈ కేసు పేరుతో తన కుమార్తెను, తన కుటుంబాన్ని సీఐడీ పోలీసులు అన్యాయంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

తన కళ్ల ఎదుటే ధరణీకృష్ణను తీవ్రంగా కొట్టారని, ప్రైవేట్‌ భాగాలపై బూటుతో తన్నారని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మూడు రోజులపాటు తనని లాకప్‌లో ఉంచి చిత్రహింసలకు గురిచేశారని, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడంతో విడిచిపెట్టారని చెప్పారు.

అయితే పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత నుంచి తన కుమార్తె కనిపించడం లేదని, ధరణీకృష్ణ అసలు బతికుందో లేదో కూడా తెలియడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయంలో తనతో పాటు చిన్న కుమార్తె, అల్లుడిని కూడా సీఐడీ పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

తమ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో పిల్లలకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇంటికి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా ఆపేసి వేధించారని ఆమె ఆరోపించారు.

పవన్‌ కల్యాణ్‌ను నమ్ముకున్నందుకు తమకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన నాగమణి.. తన కుమార్తెకు సీఐడీ పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కృష్ణలంకలో సాయికృష్ణకు జరిగినట్లే తన కుమార్తెకు కూడా ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కోర్టు వెలుపల హత్యాయత్నం.. కత్తులతో దాడి, కాల్పులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement