వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ‘ఈనాడు’లో ఈరోజు వచ్చిన వార్తపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఈనాడు అలియాస్ రోతనాడు అనే రోత పత్రికను ఆనాడు రామోజీ నడిపేవారని, ఇప్పుడు వాళ్ల కొడుకు రోత కిరణ్ నడుపుతున్నార’’ని ధ్వజమెత్తారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వందోసారి వైఎస్ జగన్ వచ్చారంటూ ‘ఈనాడు’లో వచ్చిన వార్తపై ఆయన స్పందించారు.
రేపు పొద్దున పెట్టాల్సిన హెడ్డింగ్ ఇదే..
కిరణ్ కడుపుకి అన్నమే తింటుంటే.. రేపు పొద్దున ఆయన పెట్టాల్సిన హెడ్డింగ్ ఇదేనంటూ కారుమూరి వెంకటరెడ్డి ఓ సూచన చేశారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేశ్.. ఈ 30 నెలల్లో ఎన్నిసార్లు హైదరాబాద్ కు వచ్చారు? ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి కరకట్టకు పోయారు? లేదంటే ఆంధ్రప్రదేశ్‌కు పోయారు? వాళ్లు వైఎస్ జగన్ కంటే ఎక్కువ సార్లు హైదరాబాద్ వెళ్లారు కదా? వైఎస్ జగన్ శాశ్వత నివాసం తాడేపల్లి. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు నుంచి మళ్లీ శాశ్వత నివాసం తాడేపల్లికి వస్తున్నారు. కానీ మీ శాశ్వత నివాసాలు ఎక్కడ? ఇదే రోత కిరణ్, రామోజీరావుది రాష్ట్ర పండగగా లేదంటే.. నాన్న దినాన్ని రాష్ట్ర దినంగా నిర్వహించాలన్న ఈ ప్రభుత్వం కోసం నువ్వు ఈ వార్తలు రాశావు కదా. నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి. ఆ కరకట్టలో ఉన్న ఇంట్లో ఉండాలి. మరి వారం వారం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడు? వారం వారం నారా లోకేశ్ ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నాడు? పొద్దున వచ్చి సాయంత్రానికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లిపోతున్నాడు? 30 ఇంటూ నాలుగు వారాలు వేస్తే.. మరి 120 సార్లు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వెళ్లారు’’ అని ధ్వజమెత్తారు.
అన్ని సార్లు హైదరాబాద్ వెళ్లారు..
పవన్ 150 సార్లు హైదరాబాద్ వెళ్లాడని, నారా లోకేశ్ 150 సార్లు హైదరాబాద్ వెళ్లాడని మరి ఎందుకు ఆ వార్తను కిరణ్ రాయించలేదని కారుమూరి ప్రశ్నించారు. ‘‘నువ్వు మరి కడుపుకి అన్నం తింటే ఈ వార్త రాయాలి కదా? బెంగళూరు నుంచి వందోసారి అని రాసినప్పుడు. హైదరాబాద్ నుంచి కరకట్టకు 120వ సారి వచ్చారు చంద్రబాబు. మాదాపూర్ నుంచి మంగళగిరికి పవన్ 150వ సారి వచ్చారు. నారా లోకేశ్ 150వ సారి హైదరాబాద్ నుంచి ఉండవల్లి వచ్చాడు. లేదంటే హైదరాబాద్ 150వ సారి పోయాడు. మరి మీ మంత్రులు పబ్బుల్లో ఉండే మంత్రుల గురించి రాయాలి కదా?? నేను చెప్పనా? ఏ మంత్రులు ఎక్కడెక్కడ ఏ హోటల్లో ఉంటున్నారు హైదరాబాద్‌లో? వీకెండ్ వస్తే హైదరాబాద్‌లో మంత్రులు ఏమేం చేస్తున్నారు చెప్పమంటావా? నేను చెబితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు పోయిద్ది. మీకంటే ఎటు సిగ్గు శరం ఏంటో లేదు. రాష్ట్రం పరువు అన్నది ఒకటి ఏడ్చింది కదా? అందుకని చెప్పలేం. వార్త రాస్తావా వందోసారి అని. నువ్వు నిజంగా కడుపుకి అన్నం తింటే.. మనిషి పుటక పుట్టుండుంటే రాయి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు 30 నెలల్లో ఎన్నిసార్లు వచ్చాడో రాయి. ప్రతి వారం వీళ్లు ఉండేది ఇక్కడే. జగన్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పిచ్చి పిచ్చి రాతలు రాస్తే ఇలానే మాట్లాడుతాం. ఇంకా ఇంకా మాట్లాడుతాం. రామోజీ ఫిలిం సిటీలో జరిగే వ్యవహారాల గురించి కూడా మాట్లాడుతాం. సో ఒళ్లు జాగ్రత్తగా.. నోరు జాగ్రత్తగా.. కలం జాగ్రత్తగా పెట్టుకొని రాయకపోతే మీ గురించి ఇంకా ఇంకా మాట్లాడతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మాత్రం హెచ్చరిస్తున్నాం’’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


