రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను, ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించాల్సిన ఎల్లోమీడియా.. వాటిని కప్పిపుచ్చడానికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత పర్యటనలపై లెక్కలు వేస్తూ దిగజారుడు కథనాలు రాయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. ‘‘జగన్ వందోసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి’’ అంటూ ఓ కథనం రాయడంపై వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది.
బెంగళూరుకు వెళ్లి వస్తే తప్పేంటి..?
ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ నివాసమైన బెంగళూరుకు వెళ్లడం, అక్కడి నుండి తాడేపల్లికి రాకపోకలు సాగించడం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని. అయితే, వైఎస్ జగన్ బెంగళూరుకు ‘ఎన్నిసార్లు వెళ్లారు.. అక్కడి నుంచి ఎన్ని సార్లు వచ్చారు’ అనే లెక్కలు వేయడం నిజంగా సిగ్గుచేటని మండిపడింది. ‘ఆయన కుటుంబ నివాసమైన బెంగళూరుకు వైఎస్ జగన్ వెళ్లి వస్తే.. అందులో తప్పేముందో అర్థం కావడం లేదు. అసలు ఎల్లో మీడియా అసలు ఏం చెప్పదలుచుకుందో అనేది అస్సలు అర్థం కావడం లేదు’ వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిన్న మొన్నటి వరకూ రాద్ధాంతం.. నేడు లెక్కల సిద్ధాంతం
నిన్న , మొన్నటి వరకూ వైఎస్ జగన్ బెంగళూరు నివాసానికి సంబంధించి అనవసర రాద్ధాంతం సృష్టించడంలో భాగస్వామ్యమైన ఎల్లో మీడియా.. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు బెంగళూరుకు వెళ్లి వస్తున్నారు అనే లెక్కలు వేయడం ఏంటని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది.
రాష్ట్రంలో సంక్షేమాన్ని, ప్రజల రక్షణను గాలికొదిలేసి అరాచకం సృష్టిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై కనీసం వార్త కూడా ప్రచురించని ఎల్లో మీడియా.. ఇప్పుడు వైఎస్ జగన్‌కు సంబంధించిన వ్యక్తిగత పర్యటనలపై లెక్కలు వేస్తూ కథనాలు రాయడం నిజంగా విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైఎస్ జగన్.. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఏంటి.. బెంగళూరుకు నుంచి తాడేపల్లికి వస్తే దాన్ని భూతద్దం పెట్టి వెతకడాన్ని చూస్తే ఇది ఎల్లో మీడియా దిగజారుడు తనానికి నిదర్శమని ఫైర్ అయ్యింది.
చంద్రబాబు హైదరాబాద్ టూ ఏపీ మరిచిపోయారా?
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత అధికార పక్ష నేతలు ఏళ్ల తరబడి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటూ, అక్కడి నుంచే రాజకీయాలు నడిపిన విషయాన్ని సదరు ఎల్లో మీడియా మరిచిపోయిందని, గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 2024 మధ్యకాలంలో హైదరాబాద్‌లోని తన నివాసం కేంద్రంగా ఉంటూనే, పార్టీ కార్యక్రమాలు, అసెంబ్లీ సమావేశాలు, యాత్రల కోసం హైదరాబాద్ నుంచి ఏపీకి చంద్రబాబు వచ్చిన సందర్బాలు కోకల్లలున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
మరి నాడు చంద్రబాబు హైదరాబాద్ నుండి వస్తే తప్పుకానిది, నేడు బెంగళూరు నుండి వస్తే మాత్రం ‘చుట్టపుచూపు’ అంటూ విమర్శించడం ఎల్లో మీడియా ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమ గురించే వైఎస్ జగన్ ఆలోచన
వైఎస్ జగన్ ఎక్కడ ఉన్నా.. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న ప్రజలను, పార్టీ శ్రేణులను, బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలబడటానికి వైఎస్ జగన్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారని, మరి అటువంటిది వైఎస్ జగన్ తన కుటుంబ నివాసం బెంగళూరుకు వెళ్లి వస్తే ఏదో జరిగి పోతుందని కలరింగ్ ఇవ్వడం మాత్రం ఎల్లో మీడియాకే చెల్లిందంటున్నారు.
ఏపీలో చాలా సమస్యలున్నాయ్.. వాటిపై ఫోకస్ పెట్టండి
ఓ ప్రతిపక్ష నాయకుడి వ్యక్తిగత పర్యటనలపై ఫోకస్ పెట్టిన ఎల్లో మీడియా.. ఏపీలో జరుగుతున్న అరాచక పాలన, పెరుగుతున్న నిత్యావసర ధరలు, అమలు కానీ సూపపర్ సిక్స్ హామీలపై దృష్టి పెడితే బాగుంటుందని వైఎస్సార్‌సీపీ సూచించింది. ఈ కథనాల వల్ల వైఎస్ జగన్‌కు వచ్చిన నష్టం ఏమీ లేకపోయినా, ఏదో రకంగా చంద్రబాబు మెప్పు పొందడానికే అనే విషయం స్పష్టమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో చాలా సమస్యలున్నాయని, వాటిపై ఎల్లో మీడియా ఫోకస్ పెడితే ప్రజలకు మంచి చేసినట్టు అవుతుందని చురకలంటించారు. ఇలాంటి కట్టుకథలతో ప్రజల దృష్టిని ఎంతోకాలం మళ్లించలేరని గుర్తుంచుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి హెచ్చరించారు.
కడుపుకి అన్నం తింటున్నావా లేక... ఈనాడు కిరణపై రెచ్చిపోయిన కారుమూరి https://t.co/5LvjGVd6Ay
— Sakshi (@SakshiNews) November 25, 2026
ఇదీ చదవండి: నారా లోకేష్‌కు తమిళనాడు మంత్రి కీర్తన కౌంటర్


