ఆసిఫాబాద్‌రూరల్: ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని డీటీడీవో అంబాజీ పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తానని తెలిపా రు. హాస్టళ్లలోని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారి న పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వెల్లడించారు.
సాక్షి: డీటీడీవోగా జిల్లాకు ఎలాంటి సేవలందిస్తారు?
డీటీడీవో: ఆదివాసీ జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. 2014లో ఉమ్మడి జిల్లా ఏటీడీవోగా పని చేశాను. ఆదివాసీలకు సేవ చేయడం నా బాధ్యత. ఇందులో భాగంగా గిరిజనుల అభివృద్ధి కోసం సేవలందిస్తాను. ఆశ్రమ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యను బలోపేతం చేస్తా. తరచూ పాఠశాలలను విజిట్ చేసి విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను.
సాక్షి: సింగిల్ టీచర్ స్కూళ్లు ఎన్ని ఉన్నాయి? టీచర్ల కొరత ఉందా? ఎక్కడైనా స్కూళ్లు మూతబడ్డాయా?
డీటీడీవో: జిల్లాలో 46 ఆశ్రమ వసతిగృహాలు, 334 ప్రాథమిక పాఠశాలున్నాయి. వీటిలో 13,600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 806 మంది టీచర్లలో రెగ్యులర్ ఉపాధ్యాయులు 403 మంది, సీఆర్టీలు 457 మంది పని చేస్తున్నారు. 334 సింగిల్ టీచర్ స్కూళ్లున్నాయి. ఈ సంవత్సరం మూతబడిన ఒక స్కూల్‌ను తెరి పించాం. సింగిల్ టీచర్ స్కూల్ ఉపాధ్యాయు డు అత్యవసర పరిస్థితిలో హాజరు కాని రోజు ఆ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని హెచ్‌ఎం, సీఆర్టీకి ఒకరోజు ముందు సమాచారం ఇచ్చి వేరే టీచర్లను పంపిస్తాం. విధులను నిరక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం.
సాక్షి: పదోతరగతి ఫలితాలపై మీ అంచనా?
డీటీడీవో: పదో తరగతి ఫలితాల్లో గతేడాది 98శాతం ఉత్తీర్ణత నమోదైంది. 13 స్కూళ్లు వందశాతం ఫలితాలు సాధించాయి. ఈసారి 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూ పొందించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి చేయిస్తాం. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటాం. నూతన విద్యావిధానంపై అన్ని సబ్జెక్ట్ టీచర్లకు బోధించే విధానంపై ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తాం. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అర్థమయ్యేలా బోధించేలా చర్యలు తీసుకుంటాం.
సాక్షి: వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలనున్న నేపథ్యంలో హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
డీటీడీవో: వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తుగా అన్ని వసతిగృహల్లో ఆ ర్వో (వాటర్) నీటిని అందిస్తున్నాం. పిల్లలకు రోజువారీగా మెనూ ప్రకారం ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. విద్యావీక్ష యాప్‌లో రోజువారీగా వండిన ఆహార పదార్థాలను హెచ్‌ఎం ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీంతో మెనూ అమలవుతుందా? లేదా? అన్నది వెంటనే తెలిసిపోతుంది. పాఠశాలలకు అవసరమైన మేజర్, మైనర్ పనులు పూర్తి చేస్తున్నారు. ఆర్‌బీకే వైద్య బృందం ప్రతీవారం పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధింత వార్డెన్, హెచ్‌ఎం, ఏఎన్‌ఎంలకు సూచించాం. అవసరమైతే కార్పొరేట్ వైద్యసేవలూ అందిస్తాం.
సాక్షి: గిరిజన విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
డీటీడీవో: జిల్లాలో గిరిజన సంక్షేమ కోసం వసతి గృహాలు, పాఠశాలలను విజిట్ చేస్తూ విద్యను మరింత బలోపేతం చే స్తా. ఉపాధ్యాయులు, విద్యార్థులు రో జూ పాఠశాలలకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందిస్తా. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేక గ్రూప్‌లుగా విభజించి స్పెషల్ క్లాస్‌లు నిర్వహించేలా చర్యలు చేపడతాం. వారిలో అభ్యస న సామర్థ్యాలు పెంచుతాం. ప్రతిరోజూ ఏటీడీవో తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా చర్యలు తీసుకుంటాం.


