అమ్మలకు ఆషాఢ బోనం | - | Sakshi
Sakshi News home page

అమ్మలకు ఆషాఢ బోనం

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

చింతలమానెపల్లి: బోనాలతో ఊరేగింపుగా వెళ్తున్న మహిళలు

కాగజ్‌నగర్‌టౌన్‌: ఊరేగింపులో మహిళలు, శివసత్తులు

చింతలమానెపల్లి: ఆలయంలో పూజలు చేస్తున్న గ్రామస్తులు

కాగజ్‌నగర్‌టౌన్‌/చింతలమానెపల్లి: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్‌సిల్క్‌లోని శ్రీమహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లారీ చౌరస్తా నుంచి సర్‌సిల్క్‌ దేవాలయం వరకు డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు–శివాణి దంపతులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త

పల్లి అనిత– శ్రీనివాస్‌ దంపతులు ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేశ్‌, సభ్యులు ఏర్పాట్లు చేయగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే, చింతలమానెపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో పోచమ్మ బోనాల పండగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని ధరంపెల్లి, బారెవాడ, డబ్బా గ్రామాలకు చెందిన మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. పోచమ్మ తల్లికి నూతన వస్త్రాలు, బోనాలు సమర్పించారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement