కాగజ్‌నగర్‌టౌన్: మాలీ కులస్తులకు ఎస్టీ హో దా కల్పించాలని తెలంగాణ మాలీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురె శ్యామ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని తిలక్‌నగర్ బీసీ భవన్‌లో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించగా ఆయన హా జరై మాట్లాడారు. మాలీలకు ఎస్టీ హోదా కో సం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా, ని రసన కార్యక్రమాలు నిర్వహించేందుకు విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేలా రాష్ట్రంలోని నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. జిల్లా స్థా యి నాయకుల సలహాలు, సూచనలు తీసుకుని రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు, ప్ర జాచైతన్య కార్యక్రమాలపై ప్రణాళికలు రూ పొందించామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి వసంత్‌రావు, మంచిర్యాల జిల్లా అ ధ్యక్షుడు మొర్ల మొండి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, మాలీ కులస్తులు హాజరయ్యారు.


