కాగజ్‌నగర్‌టౌన్: వరదల కారణంగా కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ సమీపంలో గల మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ దెబ్బ తినడంతో కాగజ్‌నగర్, దహెగాం మండలా ల్లో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలి చిపోయింది. ఈ విషయమై మిషన్ భగీరథ డీఈ పృథ్వీరాజ్‌ను వివరణ కోరగా.. చింతగూడ వద్ద పైపులైన్ గాస్కెట్ భారీ వరదలకు దెబ్బతినడంతో లీకేజీ అవుతోందని తెలిపా రు. దీంతో కాగజ్‌నగర్, దహెగాం మండలా ల పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరా యం ఏర్పడుతోందని పేర్కొన్నారు. మరమ్మతులు చేపట్టి సోమవారం నుంచి తాగునీటి స రఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.


