ఆసిఫాబాద్‌అర్బన్: ప్రతీ కార్మికుడు కార్మిక శా ఖలో పేరు నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ అధికారి దుర్గం క్రాంతి సూచించా రు. శనివారం జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో కార్మికులకు పలు అంశాలపై అవగాహన కల్పించా రు. కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు వ ర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని సూచించారు. జూని యర్ అసిస్టెంట్ విజయ్‌కన్నా, సిస్టం ఆపరేటర్ ఖలీద్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, జిల్లా కోశాధికారి ఆనంద్‌రావ్, మండలాధ్యక్షుడు కమలాకర్, ఉపాధ్యక్షుడు రాంచందర్, కార్యదర్శి నర్సయ్య, నాయకులు సదయ్య, శంకర్, ఆప్రోచ్, బాలాజీ తదితరులున్నారు.


