దండేపల్లి: అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన ముడిమడుగుల లక్ష్మి (50) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధి తీవ్రత పెరిగింది. భర్త పెద్దన్న బుధవారం చొప్పదండిలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని స మయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం గమనించిన స్థా నికులు పెద్దన్నకు సమాచారం అందించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.
పురుగుల
మందు తాగి డ్రైవర్..
ఆదిలాబాద్‌టౌన్: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బట్టిసావర్గాంకు చెందిన కారు డ్రైవర్ దర్శనాల విజయ్ కుమార్ (38) టీచర్స్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. గురువారం సాయంత్రం తిర్పెల్లి వద్ద గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియలేదన్నారు.
ఉరేసుకుని యువకుడు..
నిర్మల్‌టౌన్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బంగాల్ పేట్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివాసం ఉంటున్న వినోద్ (20) కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చి ఉరేసుకున్నాడు. మృతుని తల్లి లసుంబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.


