జిల్లాలోని ఎంజేపీ గురుకులాల్లో వరుస ఘటనలు ఇటీవల కాగజ్‌నగర్‌లో రోడ్డెక్కి నిరసన తెలిపిన విద్యార్థులు సరైన సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రుల డిమాండ్
కాగజ్‌నగర్‌టౌన్: సిబ్బంది తప్పిదాలో.. అధికారు ల పర్యవేక్షణ లోపామో గాని జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు గాడి తప్పుతున్నాయి. వరుస ఘటనలు చోటుచేసుకుంటుండంతో తల్లిదండ్రులు విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓ విద్యార్థినితో బలవంతంగా పెన్ను క్యాప్ మింగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన మరువక ముందే ప్రిన్సిపాల్, పీఈటీ వేధింపులు తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.
ఐదు ఎంజేపీ గురుకులాలు
జిల్లాలో మొత్తం ఐదు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు ఉన్నాయి. ఇందులో కాగజ్‌నగర్‌లో రెండు(బాలుర, బాలికలు), ఆసిఫాబాద్‌లో మూడు(బాలికలు రెండు, బాలురు ఒకటి) నిర్వహిస్తున్నారు. అయితే రెండింటికి మాత్రమే పక్కా భవనాలు ఉండగా, మరో మూడు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సుమారు రెండు వేల మంది చదువుకుంటున్నారు. ఆయా గురుకులాల్లో నిత్యం ఏదో ఒక ఘటన వెలుగు చూస్తుండటంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు మాయమైనా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
వరుస ఘటనలు
సోషల్ మీడియాకు అడిక్ట్
మారుతున్న టెక్నాలజీతో పిల్లలు సోషల్ మీడియాలో వస్తున్న ఘటనలకు అడిక్ట్ అవుతున్నారు. విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించాం. ప్రిన్సిపాల్, పీఈటీ కొత్తగా రావడం, వారు కొంత కఠినంగా నిబంధనలు అమలు చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. – శ్వేత, డీసీవో
అద్దె భవనంలో ఇబ్బందులు
కాగజ్‌నగర్ పట్టణంలోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ ఇరుకు గదుల్లో పాఠాలు బోధిస్తున్నారు. చిన్న గదిలో తరగతి గదితోపాటు అందులోనే విద్యార్థుల వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎ దురవుతున్నాయి. సరైన ప్రహరీ లేకపోవడంతో భోజనాలు చేసేందుకు ప్రత్యేక గది లేదు. రోడ్డుపక్కన ఖాళీ స్థలంలో భోజనాలు చేస్తుంటారు.


