ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని అంకుసాపూర్ పంచాయతీ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే విజయవంతంగా ముగిసింది. ఇక్కడ మొత్తం 750 మంది ఓటర్లు ఉండగా, 719 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. మరో 31 మందిని వివరాలు సేకరించలేని కేటగిరీగా గుర్తించారు. 719 మంది నుంచి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించి వివరాలు డిజిటలైజేషన్ చేశారు. గురువారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఎల్‌వోలు సుజాత, నర్సక్కను సర్పంచ్ గంగారాం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, గ్రామస్తులు బలరాం, రవి, సంతోష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.


