విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెంచాలి

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆలోచన శక్తి, పరిశోధన, శాసీ్త్రయ వైకరి ని పెంచాలని జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ ఉన్నత పాఠశాలలో గురువారం సైన్స్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమానికి హాజరై సూచనలు చేశారు. ఆయన మాట్లాడు తూ జీవశాస్త్ర బోధనలో పాఠ్య పుస్తకానికే పరి మితం కావ్వొద్దన్నారు. ప్రయోగాలు, పరిశీల న, చర్చలు, స్థానిక వనరులు వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం, కార్యాచరణ ఆధారిత అభ్యసన పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఉమబాల, జిల్లా రిసోర్స్‌పర్సన్లు రాజేష్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement