కాగజ్‌నగర్‌టౌన్: మండలంలోని బారెగూడ పంచాయతీకి అరుదైన గుర్తింపు దక్కింది. ఇంటింటికీ నల్లాలతో వందశాతం తాగునీటి ని సరఫరా చేసినందుకు హర్ ఘర్ జల్ ధ్రు వీకరణ పత్రాన్ని మిషన్ భగీరథ ఇన్‌ట్రా డీఈ రాజేశ్, ఏఈ సాయికృష్ణ గురువారం సర్పంచ్ కోట వేణుకు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలకు సురక్షితమైన తాగునీరు ని రంతరం అందించడమే లక్ష్యమని తెలిపారు. హర్‌ఘర్ జల్ లక్ష్యాన్ని సాధించడంలో సహకరించిన మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యదర్శి నరేశ్, వార్డు సభ్యుడు హరీశ్ పాల్గొన్నారు.


