‘ఆడబిడ్డలను మోసం చేస్తున్న సర్కార్‌’ | - | Sakshi
Sakshi News home page

‘ఆడబిడ్డలను మోసం చేస్తున్న సర్కార్‌’

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

కెరమెరి: హామీలు నెరవేర్చకుండా ఆడబిడ్డలను కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం చేస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి నగదుతోపాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగార్జున, డీటీ సంతోష్‌కుమార్‌, సర్పంచ్‌ పెందోర్‌ ఆనంద్‌రావు, నాయకులు యూనూస్‌, చందు, రిజ్వాన్‌, ధర్మూ, అరుణ్‌, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement