రెబ్బెన: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్ తె లిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్‌లో జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ –2026, ఎస్జీఎఫ్ జిల్లా ఎంపికలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. సబ్ జూనియర్, జూనియర్ వి భాగాల్లో బాలురు, బాలికలు అధికసంఖ్య లో వివిధ యోగాసన విభాగాల్లో ప్రతిభ చా టా రని తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో జిల్లాను యో గాసన క్రీడలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అసోసియేషన్ తరఫున అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం పో టీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్జీఎఫ్ కా ర్యదర్శి రామ్మోహన్, అబ్జర్వర్ శ్రీనివాస్, కోశాధికారి మల్లేశ్, కోచ్‌లు అలేఖ్య, స్వప్న పాల్గొన్నారు.


