ఎలా మోసపోతున్నారంటే.. | - | Sakshi
Sakshi News home page

ఎలా మోసపోతున్నారంటే..

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

జిల్లాలో ఎక్కువగా ఓఎ ల్‌ఎక్స్‌ మోసాలు జ రుగుతున్నాయి. తక్కువ వడ్డీకే లోన్‌ అంటూ లోన్‌ యాప్‌ ల ద్వారా కూడా అమాయకులు మోసపోతున్నారు. ఇంటి నుంచే పని అంటూ పెట్టుబడుల పేరుతో సామాన్యులను మోసగిస్తున్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో బెదిరింపులు ఎక్కువగా జరుగుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇలాంటి యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత పెట్టుబడులు పెట ్ట వద్దని, ఎలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించే ముందు ఆగి ఆలోచించి నిజమా.. కాదా.. అని ధ్రువీకరించుకున్నాకే అడుగు ముందుకేయాలని సూచిస్తున్నారు. మాట్రిమనీ సైట్ల ద్వారా పరిచయమయ్యే వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వివాహం పేరుతో నమ్మకం పొందిన అనంతరం డబ్బులు వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలు అడిగితే జాగ్రత్త వహించాలని, దేనికై నా పూర్తిగా ధ్రువీకరించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement