వన దర్శినిలో విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

వన దర్శినిలో విద్యార్థులు

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: అటవీశాఖ వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా కాగజ్‌నగర్‌ రేంజ్‌ పరిధిలో శనివారం వన్‌ దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగజ్‌నగర్‌ అటవీ రేంజ్‌ అధి కారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వేంపల్లి సెక్షన్‌లో పీఎంశ్రీ జవహర్‌ నవోదయ విద్యాలయం విద్యార్థులు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. విద్యార్థులకు అడవులు, వృక్ష జంతుజాలం, అటవీ సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సోలార్‌ పీటీ, వెడెన్‌ మాచన్‌, చిరుత పాదముద్రలు, వేంపల్లి వాచ్‌ టవర్‌ ప్రాంతాన్ని విద్యార్థులకు చూపించా రు. వేంపల్లి, కాగజ్‌నగర్‌ డీఆర్వోలు శశిధర్‌బాబు, హేమలత, వేంపల్లి బీట్‌ అధికారి విజ య్‌చంద్ర, వాచర్‌ కోవా విజయ్‌, వాసుదేవ్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement