ఆసిఫాబాద్: ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ ఆరోపించారు. శనివా రం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 40వేల మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు. కార్యక్ర మంలో సంఘం జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, ఉపాధ్యక్షుడు కొదురుపాక మహేశ్, ప్రవీణ్, ఆనంద్, కార్మికులు పాల్గొన్నారు.


