ఆసిఫాబాద్‌అర్బన్: ఏఐటీయూసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా టి.దివాకర్, ప్రధాన కార్యదర్శిగా బోగే ఉపేందర్, డిప్యూటి ప్రధాన కార్యదర్శి గా ఆత్మకూరి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు గా కె.రాజాగౌడ్, బి.సుధాకర్, కె.మహేశ్, జి ల్లా కార్యదర్శులుగా అశోక్, షకీర్, జిల్లా కోశాధికారిగా సంతోషితోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులు, 33 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.


