విద్యార్థులకు వ్యాసరచన పోటీలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఈ నెల 29న వరల్డ్‌ టైగర్‌ డే సందర్భంగా పట్టణంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సోమవారం అటవీశాఖ అధికారులు ప్రజలు, పెద్దపులి మధ్య సంఘర్షణ అనే అంశంపై వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు సెక్షన్‌ అధికారి రవికుమార్‌ అడవులు, పులుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. పులుల పరిరక్షణ, ఆవశ్యకతను తెలియజేయడానికి ఏటా ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం, అడవులను సంరక్షించడం, వన్యప్రాణుల వేటకు పాల్పడకుండా ఉండడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీ అధికారులు గిరిబాబు, భీమయ్య, పీడీ రాజేంద్రప్రసాద్‌, అంజయ్య, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement