త్వరితగతిన ఫిర్యాదులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన ఫిర్యాదులు పరిష్కరించాలి

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

● ఎస్పీ నితిక పంత్‌

● ఎస్పీ నితిక పంత్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్ల అధికారులతో ఫోన్‌ ద్వారా మాట్లాడి స్థితిగతులు తెలు సుకున్నారు. చట్టపరంగా పరిష్కరించాలని సూచనలు చేశారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసుశాఖ దృష్టికి సమస్యలు తీసుకురావాలని సూచించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement