వాంకిడి: జాతీయ రహదారి నిర్మాణానంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, అండర్‌పాస్ నిర్మించాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం వాంకిడి మండలంలోని బంబార గ్రామస్తులు కలెక్టరేట్‌కు పాదయాత్రగా బయలుదేరారు. రోడ్డు దాటేందుకు అండర్‌పాస్ నిర్మాణం, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొయిరె ప్రకాశ్ అన్నారు. హైవే అధికారుల నిర్లక్ష్యపు వైఖరికి నిరసనగా గ్రామస్తులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు మహా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు.


