ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్‌వో శేకు జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. అండ ర్ 6 నుంచి అండర్ 20 వరకు అథ్లెటిక్స్ పోటీలకు వందమంది క్రీడాకారులు హాజరు కా గా, 40 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసిన ట్లు వారు తెలిపారు. ఆగస్టు 7న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయిలో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలకు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్ విజయ్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏటీడీవో చిరంజీవి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, పీడీలు మీనారెడ్డి, రాకేశ్, స్వప్న, సునీత తదితరులు పాల్గొన్నారు.


