కెరమెరి: రేషన్ బియ్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని, రేషన్ కార్డులను రద్దు చేస్తామని అదనపు కలెక్టర్ డేవిడ్ హెచ్చరించా రు. శనివారం మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులో పేరుండి మరణించిన వారి పేర్లు తక్షణమే తొలగించాలని, ఈకేవైసీ ఈ నెల 31 వరకు పొడిగించారని తెలిపారు. గడువులోపు వందశాతం పూర్తి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ నాగార్జున, డీటీ సంతో ష్‌కుమార్, డీలర్లు, సేల్స్‌మెన్‌లు పాల్గొన్నా రు.


