కెరమెరి: అన్నదాతలకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. విత్తనాలు, ఎరువుల ధరలు అమాంతం పెంచడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ఏటా యంత్ర పరికరాలు, ఇతర రాయితీలు అందించా ల్సిన సర్కారు ఆ వైపుగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. రాయితీపై వ్య వసాయ యంత్రాలు, పనిముట్లు అందించాలని రై తులు ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలే దు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కారు.. అని చెప్పుకొంటున్న కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరస్థితులకు భి న్నంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. వా నాకాలం సీజన్ ప్రారంభమై రెండునెలలైనా యంత్రపరికరాల పంపిణీపై దృష్టి సారించలేదు.
ఆర్థికంగా చితికిపోతున్న రైతులు
అన్నదాతలకు వ్యవసాయం పెనుభారంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు అమాంతం పెరగడంతో ఆర్థికభారం మోస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించడం లేదు. ఏటా పెట్టుబడి సాయంగా రైతుభరోసా ఇస్తున్నా ఏమాత్రం సాగు ఖర్చులకు సరిపోవడంలేదు. దీంతో రైతులు వ్యవసాయాన్ని భారంగా భావిస్తున్నారు. నిధులు లేవని 2018 నుంచి యంత్రలక్ష్మి పథకాన్ని నిలిపివేశారు. నాలుగేళ్లుగా రాయితీ విత్తనాల పంపిణీ నిలిచిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్‌లో అధికధరలకు కొనుగోలు చేసి అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతున్నారు.
పరికరాలు పంపిణీ చేయాలి
ప్రభుత్వం ఎకరాకు రూ.6వేల పెట్టుబడి సాయం ఇవ్వడం మంచిదే. కానీ, వ్యయసాయ యంత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో వ్యవసాయశాఖ నుంచి వివిధ రకాల పరికరాలు అందేవి. ప్రస్తుతం సాగుకు ఖర్చులు అధికమవుతున్నాయి.
– సోనేరావు, రైతు, కెరమెరి
రాయితీలిచ్చి ఆదుకోవాలి
విత్తనాలు, యూరియా ధరలు పెరిగాయి. వ్యవసాయం చేద్దామంటే ప్రస్తుతం చేతిలో డబ్బులుంటే గాని కుదరని పరిస్థితి ఉంది. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతుభరోసాతోనే చేతులు దులుపుకొంటోంది. ఎప్పటిలాగే రాయితీలిచ్చి ఆదుకోవాలి.
– మడావి రఘునాథ్, రైతు మెట్టపిప్రి


