విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా.. మొదలుకాని మధ్యాహ్న భోజన పథకం ఉమ్మడి జిల్లాలో 20,666 మంది విద్యార్థులు
లక్ష్మణచాంద: ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల మాదిరి ప్రభుత్వ జూని యర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉదయాన్నే కళాశాలలకు హాజర య్యే విద్యార్థులు మధ్యాహ్నం ఖాళీ కడుపులతో పా ఠాలపై శ్రద్ధ చూపరని భావించిన ప్రభుత్వం ఉద యం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులు, పోషకులు హర్షం వ్యక్తం చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని సంబరపడ్డారు. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఉ మ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో తరగతులకు హాజరవు తూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాఠాలపై శ్రద్ధచూపలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లా సమాచారం
జిల్లా కళాశాలలు మొత్తం
విద్యార్థులు నిర్మల్ 13 4,930
మంచిర్యాల 10 4,320
ఆదిలాబాద్ 13 6,606
కుమురంభీం 11 4,810


