బెల్టు షాపులు మూసి వేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

బెల్టు షాపులు మూసి వేయాలని ధర్నా

Jul 18 2026 12:06 AM | Updated on Jul 18 2026 12:06 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులు మూసివేయాలని వాంకిడి మండలంలోని చిచ్చల్లి, సోనాపూర్‌, గణేష్‌ పూర్‌, పోనగూడతోపాటు మొత్తం ఏడు గ్రా మాల మహిళలు శుక్రవారం జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ మద్యానికి బానిసలైన పురుషులు కుటుంబాలను పట్టించుకోవడం లేదని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. సంపాదనంతా ఆస్పత్రుల కు వెచ్చిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బెల్టు షాపులను తక్షణమే మూసివేసేందుకు కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరా రు. మహిళల ధర్నాకు ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు నంది పద్మ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్‌, నాయకులు ఆత్మకూరి చిరంజీవి, రాజ్‌కుమార్‌ మద్దతు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement