పెంచికల్‌పేట్: బొక్కివాగు ప్రాజెక్టు నీటిని రైతులు సాగుకు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామంలోని బొక్కివాగు ప్రాజెక్టు గేటుకు బిగించిన నూతన షటర్ ద్వారా కాలువకు శుక్రవారం ఆయన నీటిని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, రైతులు ప్రాజెక్టు నీటిని అవసరం మేరకే వాడుకోవాలని సూచించారు. రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఎల్లూర్, ఎల్కపల్లి సర్పంచులు చప్పిడే రవీందర్, రాంచందర్, డీఈ భద్రయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు కుకిడే రాజేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు సంతోష్, పార్టీ నాయకులు ఉన్నారు.


