కాగజ్‌నగర్‌టౌన్: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ వహీదుద్దీన్ తెలి పారు. ఎస్పీ నితకా పంత్ ఆదేశా ల మేరకు శనివా రం పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో తెల్లవారు జాము న పోలీసులు నాలుగు బృందాలుగా విడిపో యి ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేష న్, లైసెన్స్ లేని 64 ద్విచక్ర వాహనాలు, అనుమతి లేకుండా నడుస్తున్న 1 ఆటోను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరి రక్షణలో భాగంగా చోరీలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు భద్రత నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సైలు లక్ష్మ ణ్, యాదగిరి, సందీప్ పాల్గొన్నారు.


