మంచిర్యాల జిల్లాలో హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించడం, ప్రసవం అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవడంతోనే మృత శిశు మరణాలు తగ్గాయి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ముందుగానే రక్తం ఎక్కించేలా ఏర్పాట్లు చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకునేలా వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం చేస్తున్నాం. ఇద్దరు గైనకాలజిస్టులు, మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో గర్భం దాల్చిన నుంచి ప్రసవం అయ్యే వరకు పరీక్షించడం వంటి చర్యలు తీసుకున్నాం.
– డాక్టర్ నరేందర్‌రాథోడ్, మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి


