ప్రతిభకు తగ్గ కోర్సులు ఎంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు తగ్గ కోర్సులు ఎంచుకోవాలి

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

● కలెక్టర్‌ కె.హరిత ● కెరీర్‌ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు

కాగజ్‌నగర్‌టౌన్‌: విద్యార్థులు తమ ఆసక్తి, ప్రతిభ కు తగిన కోర్సులు ఎంచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. శని వారం పట్టణంలోని ఎస్పీఎం క్లబ్‌లో మిత్ర కెరీర్‌ గైడెన్స్‌ ఆధ్వర్యంలో ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ మాట్లాడు తూ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, మనలో ఉన్ననైపుణ్యతను మెరుగుపర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చన్నారు. కేరీర్‌ మిత్ర ఫౌండేషన్‌ వారు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవా లన్నారు. ఒకచోట ఆగిపోకుండా నిత్యం ప్రయత్నించడం ద్వారా లక్ష్యసాధన సులభతరం అవుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు నైపుణ్యతకు సంబంధించిన పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, ఫౌండేషన్‌ సభ్యులు వంశీకృష్ణ, విజయ్‌కుమార్‌, శ్రీకాంత్‌, మణికుమార్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement