కాలినడకన తిరుగుతూ పనులు పరిశీలన
చింతలమానెపల్లి: మండలంలోని రవీంద్రనగర్– 1 పంచాయతీలో గురువారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ పర్యటించారు. కాలినడకన తిరుగుతూ పీహెచ్‌సీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వారసంత, డ్రెయినేజీ పనులను పరిశీలించారు. వారసంతలో చెత్త పోగై ఉండడంపై పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించారు. ఆర్‌ఎంపీ దవాఖానా నుంచి ఇంజిక్షన్లు, ఖాళీ సీసాలు చెత్త వేసినట్లు సిబ్బంది తెలపడంతో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చే యాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిసరాలు, తరగతి గదులు పరిశీలించారు. పాఠశాలలో లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. 9, 10వ తరగతి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యాధికారి రాజ్‌కుమార్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పంచాయతీలో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను వెంట తీసుకెళ్లారు. ఎంపీడీవో మహేందర్, సర్పంచ్ సూరజ్‌దాస్, కార్యదర్శి భాస్కర్, ఉప సర్పంచ్ బిష్ణు బిశ్వాస్ ఉన్నారు.


