లక్ష్యాల సాధనలో ‘నీతి తారా’ కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాల సాధనలో ‘నీతి తారా’ కీలకపాత్ర

Jul 25 2026 1:53 AM | Updated on Jul 25 2026 1:53 AM

● అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: నీతి ఆయోగ్‌ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం, ఆకాంక్షిత బ్లాక్‌ లక్ష్యా ల సాధనలో నీతి తారా పోర్టల్‌ కీలకపాత్ర పోషి స్తుందని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం నీతి తారా పోర్టల్‌ వినియోగం, డాటా ఎంట్రీ, పర్యవేక్షణ, విశ్లేషణలపై జిల్లా అధికారులు, సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల పనితీరు సూచికలను నిరంతరం పోర్టల్‌లో నమోదు చేసి, విశ్లేషించడం ద్వారా అభివృద్ధి సూచీల పురోగతిని నిరంతరం పర్యవేక్షించవచ్చన్నారు. డేటా ఆధారిత ప్రణాళికలు రూపొందించడం, లోపాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టడం, ప్రభుత్వ పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో పోర్టల్‌ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈడీఎం గౌతమ్‌రాజ్‌, ఏబీఎఫ్‌ బాలరాజు రాజారాం, ఈడీ సీఈఎల్‌ మాస్టర్‌ ట్రైనర్‌ నర్సింగ్‌దాస్‌, ఏఎల్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమర్థవంతంగా అమలు చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: శిక్షణలో నేర్చుకున్న అంశాలను సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్ట ర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో హెచ్‌ఎంలు, ఎస్‌వోలకు అందిస్తున్న మూడు రోజు ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి శుక్రవారం హాజ రయ్యారు. త్వరలో ఉద్యోగ విరమణ పొందనున్న ప్రధానోపాధ్యాయులు రవీందర్‌, పురుషోత్తంను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సచ్చిదానంద చారి, క్వాలిటీ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ లతీఫ్‌, రిసోర్స్‌పర్సన్లు హనుమంతు, ప్రభోద్‌, నటరాజ్‌, ఎంఈవో సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement