పెంచికల్‌పేట్: అటవీ శాఖ అధికారులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అడ్డుకోవద్దని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని పోతపెల్లి శివారులో మంగళవారం పోడు రైతులు చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తరతరాలుగా ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు లాక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. ఎస్టీ రైతులు సాగు భూములపై ఎలాంటి అభ్యంతరం లేదని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. రైతలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. పోడు భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, సీఐ కుమారస్వామి, ఎఫ్‌ఆర్వో అనిల్‌కుమార్, ఎస్సై అనిల్‌కుమార్, కాంగ్రె్‌స్ మండల అధ్యక్షుడు సముద్రాల రాజన్న, సర్పంచ్ ఉస్మాన్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


