కాగజ్‌నగర్‌టౌన్: విద్యుత్ ఉద్యోగుల అక్రమ అరెస్టులు సరికాదని తెలంగాణ యూనైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ముంజం ఆనంద్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని పోలీస్ స్టే షన్ వద్ద మాట్లాడారు. విద్యుత్ ఆర్టిజన్, అసిస్టెంట్, ఇతర విద్యుత్ ఉద్యోగుల న్యాయమై న సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో నిర్వహించే మహా ధర్నాకు వెళ్లకుండా అ డ్డుకోవడం సిగ్గుచేటన్నారు. న్యాయమైన హ క్కుల కోసం పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104, 327, టీఎస్‌యూఈఈయూ నాయకులు అరెస్టయిన విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.


