మానవత్వం మరిచి.. దాడులకు తెగబడి | - | Sakshi
Sakshi News home page

మానవత్వం మరిచి.. దాడులకు తెగబడి

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

● ఆందోళన కలిగిస్తున్న హత్యలు, హత్యాయత్నాలు ● ఇటీవల జిల్లాలో వరుస ఘటనలు

కౌటాల: మనుషుల్లో అనుబంధాల కన్నా ఆవేశమే రాజ్యమేలుతోంది. ప్రేమ, అప్యాయతలు.. పగ, ప్రతీకారాలుగా మారుతున్నాయి. జిల్లాలో వరుస హత్యలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నపాటి కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు, పరువు, భూ వివాదాలతో గొడవలతో హత్యలకు పాల్పడుతున్నారు. చాలా ఘటనల్లో రక్తసంబంధీకులే నిందితులుగా ఉంటున్నారు. ఇటీవల రెబ్బెన మండలంలో జరిగిన ఘటనలు నేరాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. జిల్లాలో 2023లో 32 హత్యలు జరగ్గా, 2024లో 12, గతేడాది 18 హత్య జరిగినట్లు పోలీసు రికార్డులు జరుగుతున్నాయి. ఆ మూడేళ్లలో 84 హత్యాయత్నం కేసులు సైతం నమోదయ్యాయి. మద్యం, గంజాయి మత్తులో కట్టుకున్న వారిని కడతేర్చడం, కన్నవారిని కొడుకులే హత్య చేయడం, తల్లిదండ్రులను పిల్లలు చంపడం, తోడబుట్టినవాడిని చంపుకోవడం వంటి ఘటనలు మాయని మచ్చగా మిగులుతున్నాయి. నేరాల నియంత్రణకు పోలీస్‌శాఖ చేపడుతున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement