ఆసిఫాబాద్: ఆర్థిక స్థోమత లేని నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన యూటీఆర్సీ సమావేశంలో మాట్లాడారు. విచారణలో ఉన్న కేసులను సమీక్షించారు. చట్టపరంగా బెయిల్ మంజూరైన కేసుల్లో జామీను పెట్టుకుని విచారణ ఖైదీలను ఎంపవర్డ్ కమిటీకి రెఫర్ చేశారు. సమావేశంలో డీఎల్‌సీఏ కార్యదర్శి సంకేత్‌మిత్ర, జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్, ఎస్సై విజయ్ పాల్గొన్నారు.


