లింగాపూర్: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఎస్పీ నితిక పంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతోపాటు రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. మండలంలో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


