నిరుపయోగంగా లేక్ వ్యూ రెస్టారెంట్ భవనం
అడ ప్రాజెక్టు ఒడ్డున వృథాగా బోట్
నిరుపయోగంగా మారి..
ఆసిఫాబాద్ మండలం అడ గ్రామం వద్ద గల కుమురం భీం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో బోటింగ్ కోసం 2023 ఏప్రిల్‌లో అప్పటి కలెక్టర్ రాహుల్‌రాజ్ రూ.25 లక్షల వరకు వెచ్చించి పెద్ద పడవ, చిన్న పడవలను కొనుగోలు చేశారు. వీటితోపాటు పర్యాటకుల కోసం ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రూ.40 లక్షల టూరిజం నిధులతో గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా లేక్ వ్యూ రెస్టారెంట్ నిర్మించారు. కానీ కుమురంభీం ప్రాజెక్టు వద్ద పర్యాటక అభివృద్ధి కలగానే మిగులుతోంది. 2023లో పర్యాటకులను ఆకర్షించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బోటింగ్‌కు మొదట్లో గిరాకీ ఉండేది. ఒక్కొక్కరికి రూ.50 టికెట్ ధర నిర్ణయించారు. మొదటి నాలుగు నెలలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, జిల్లా కేంద్రం ప్రజలు ప్రాజెక్టులో బోటింగ్‌ను ఆస్వాదించడానికి వచ్చేవారు. ఆ తర్వాత నిర్వహణ గాడి తప్పింది. బోటింగ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. పర్యాటకులను ఆకర్షించే ఇతర సౌకర్యాలేవీ కల్పించకపోవడంతో ఆదరణ కరువైంది. బోటింగ్ పడవ, రెస్టారెంట్ నిరుపయోగంగా మారాయి.


