ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. వట్టివాగు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.404 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 239 మీటర్లు కాగా ప్రస్తుతం 238.30 మీటర్లకు చేరింది. 6,000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, మూడు గేట్లను ఒక మీటర్‌ వరకు పైకెత్తి 5,400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. రాజుర, రహపల్లి, చోర్‌పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్‌ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అలాగే కుమురంభీం(అడ) ప్రాజెక్టుకు 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 10.3 టీఎంసీలకు గాను ప్రాజెక్టులో 4.9 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement